తెలంగాణ

telangana

ETV Bharat / state

తీలేరు ఘటనపై సుమోటో కేసు నమోదు - teeleru

నారాయణపేట జిల్లా తీలేరులో జరిగిన కూలీల మృతి ఘటనపై జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సుమోటోగా కేసు నమోదు చేసింది. బాధిత కుటుంబాలకు సాయం అందేలా చూస్తామని జిల్లా న్యాయమూర్తి జీవీ సుబ్రమణ్యం హామీ ఇచ్చారు.

తీలేరు ఘటనపై సుమోటో కేసు

By

Published : Apr 12, 2019, 10:03 PM IST


నారాయణపేట జిల్లా తీలేరులో ఈ నెల 10న మట్టి దిబ్బలు మీద పడి పది మంది కూలీలు మృతి చెందిన ఘటనలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సుమోటోగా కేసు స్వీకరించింది. న్యాయ సేవా కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. తీలేరు గ్రామంలో పర్యటించి వివరాలు, వాంగ్మూలాలు సేకరించారు.

ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్, జిల్లా న్యాయమూర్తి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఘటనకు గల కారణాలు, కూలీల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలపై విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు చట్టపరంగా సాయం అందేలా చూస్తామన్నారు.

తీలేరు ఘటనపై సుమోటో కేసు

ఇవీ చూడండి: నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details