తెలంగాణ

telangana

ETV Bharat / state

భయంలేకుండా భరోసా కల్పించడమే మా లక్ష్యం:  ఎస్పీ చేతన - sp

నారాయణపేట జిల్లాలో మహిళలకు భద్రత కల్పించేందుకు నూతనంగా షీటీం బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జన సంచారంలో ఉండి మహిళలను వేధించే ఆకాతాయిల పనిపడతామని జిల్లా ఎస్పీ చేతన హెచ్చరించారు.

షో టీమ్ కోసం 2కె రన్​

By

Published : Apr 13, 2019, 2:00 PM IST

నారాయణపేట కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. నారాయణపేట నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక షీ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 2కే రన్​లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

షో టీమ్ కోసం 2కె రన్​
విద్యార్థులు, మహిళలకు రక్షణ అందించేందుకు ఈ టీంలు కృషి చేస్తాయని ఎస్పీ చేతన తెలిపారు. ఎవరైనా వేధిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి భయం లేకుండా భరోసా కల్పించడమే షీ బృందాల ముఖ్య ఉద్దేశమని చేతన వెల్లడించారు. పోలీస్ స్టేషన్​ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ 2కె రన్​లో ఎస్పీ చేతన కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహ పరిచారు.

ABOUT THE AUTHOR

...view details