తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి కార్యక్రమం' - సందీప్ కుమార్ సుల్తానియా వార్తలు

పల్లెల్లో మురుగు కాలువలు, చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

sandeep kumar sultania review meeting at narayanpet district
'గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి కార్యక్రమం'

By

Published : Jul 30, 2020, 12:43 PM IST

గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పల్లెల్లో మురుగు కాలువలు, చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సందీప్ సూచించారు. ప్రతి పంచాయతీలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, హరితహారం, గ్రామాభివృద్ధిపై అవి దృష్టిసారిస్తాయన్నారు.

వైకుంఠధామాలను సెప్టెంబరు వరకు పూర్తి చేయడంతో పాటు నీటి వసతికి ట్యాంకు నిర్మించాలన్నారు. అన్నదాతలను సంఘటితం చేసేందుకు రైతు వేదికలను నిర్మించామన్నారు. కలెక్టర్‌ హరించదన మాట్లాడుతూ.. ప్రతినెల సమన్వయ సమావేశాలు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు, డీపీవో మురళి, పంచాయతీరాజ్‌ ఈఈ రషీద్‌, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details