Rice Millers Fraud in Narayanpet :నారాయణపేట జిల్లాలో ఇటీవల పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు బియ్యం మిల్లులపై తనిఖీలు నిర్వహించారు. మరికల్‌లోని శ్రీ వెంకటేశ్వర రైస్‌మిల్‌లో 70వేల 700 ధాన్యం బస్తాలు ఉండాల్సి ఉండగా ఒక్కటీ లేదు. మక్తల్‌లోని లిమ్రా రైస్‌మిల్లులో 42వేల 918 బస్తాలు నిల్వ ఉండాల్సి ఉండగా ఇక్కడా ఒక్క బస్తా ధాన్యం కూడా లేదు. తెలంగాణ రైస్‌మిల్లులో 62వేల 540 బస్తాలకుగాను కేవలం 4వేల 500 బస్తాలు మాత్రమే ఉన్నాయి. స్టార్ రైస్‌మిల్లులో 99వేల 903 బస్తాలు ఉండాల్సి ఉండగా 45వేలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Rice mill seizedin Narayanpet :మాగనూర్ మండలం వడ్వాట్ మల్లికార్జున రైస్‌మిల్లు(Rice Mill)లో 97వేల 639 బస్తాలకు 76వేల బస్తాలు, ఉమర్ రైస్‌మిల్లులో 31వేల 56 బస్తాలకు 6వేల 500 బస్తాలు మాత్రమే నిల్వ ఉండడంతో ఈ ఆరు మిల్లులను సీజ్ చేశారు. 6మిల్లుల్లో మొత్తం 4లక్షల 4వేల 758 బస్తాల ధాన్యానికిగాను లక్షా 32వేల బస్తాలే ఉన్నాయి. మిగిలిన 2లక్షల 72వేల 758 బస్తాల ధాన్యం అంటే సుమారు 97వేల క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టింది. ఈ ధాన్యాన్నంతా మరాడించి మిల్లర్లు ప్రభుత్వానికి అప్పంగించాల్సి ఉంటుంది.
Telangana Govt Issued Orders Grain Auction : ధాన్యం బహిరంగ వేలానికి రంగం సిద్ధం.. ఉత్తర్వులు జారీ
Rice Smuggling from Telangana to Maharashtra :మరి మరాడించాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు ఏం చేశారన్న దానిపైనే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చజరుగుతోంది. మిల్లుల్లోని ధాన్యాన్ని కర్ణాటకలోని గుర్మిటికల్, రాయచూర్‌కు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. మఖ్తల్, కృష్ణా, మరికల్ ప్రాంతాలకు చెందిన ధాన్యం రాయచూరుకు నారాయణపేట, మద్దూరు, కోస్గి, దామరగిద్దలోని పలు మిల్లుల నుంచి గుర్మిటికల్‌కు అక్రమగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడి బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో వాటిని నల్లబజారుకు తరలించి అక్కడ మరాడించి మహారాష్ట్రలోని పుణె, ముంబయి ప్రాంతాల్లో ఈ బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
"నారాయణపేట జిల్లాలో మొత్తం 60 రైస్ మిల్లులకు ధాన్యం ఇవ్వడం జరిగింది. సీఎం ఆదేశాలతో అన్ని రైస్ మిల్లులు తనిఖీలు చేశాం. గత సీజన్‌లకు సంబంధించి ధాన్యం రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్నాయి. మరికల్, మఖ్తల్, కృష్ణా, మాగనూరులో ఉన్న రైస్ మిల్లులు సీజ్ చేశాం. వారు బియ్యాన్ని వేరే రాష్ట్రాలకు తరలించినట్లు గుర్తించాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం". -హాథీరామ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, నారాయణపేట