తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారంలోకి రాగానే చర్లపల్లి జైళ్లో కేసీఆర్​కు డబుల్ బెడ్​రూం ఇల్లు కట్టించడం ఖాయం: రేవంత్ - నారాయణపేట జిల్లా సభలో రేవంత్ రెడ్డి

Revanth Reddy In Narayanpet Public Meeting : ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్​ఎస్​ అభ్యర్థి రాజేందర్ రెడ్డిని రాయచూర్​కు.. కేసీఆర్​ను ఫామ్​హౌస్​కు పంపుదామని ప్రకటించారు.

Revanth Reddy Slams BRS Candidate Rajendar Reddy
Revanth Reddy In Narayanpet Public Meeting

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 3:38 PM IST

Revanth Reddy In Narayanpet Public Meeting : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..కేసీఆర్​కు (KCR) చర్లపల్లి జైళ్లో డబుల్ బెడ్​రూం ఇల్లు కట్టించడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణపేటలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుత బీఆర్​ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని ఎన్నుకున్న ప్రజలను, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే రాజేందర్ పార్టీ మారితే.. ఈ ప్రాంతానికి ఎందుకు కృష్ణా జలాలు రాలేదని ప్రశ్నించారు. ఎందుకు నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పేరుకే నారాయణపేట జిల్లా అయిందని.. అక్కడ కనీస మౌలిక వసతులు లేవన్నారు.

రైతుబంధు నిధుల విడుదలతో కేసీఆర్, మోదీ బంధం బయటపడింది : రేవంత్ రెడ్డి

"జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లేదు. నారాయణపేట మున్సిపాలిటీలో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి లేదు. పర్ణిక రక్తంలోనే త్యాగం ఉంది.. సేవా గుణం ఉంది. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల ఆలోచన చేసి అనుమతులు తెచ్చిందే కీ.శే.చిట్టెం నర్సిరెడ్డి. ఇక్కడి చెరువులు నిండాలని, కోస్గి, దామరగిద్ద ప్రాంతాలకు నీళ్లు రావాలని నిధులు తెచ్చింది నేను. చిట్టెం నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి చివరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్లు నిజాయితీపరులు." - రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

Revanth Reddy Slams BRS Candidate Rajendar Reddy : నారాయణపేట ఎమ్మెల్యే బస్టాండ్​లో తిని బజారులో పడుకుంటారని ఎద్దేవా చేశారు. ఇక్కడ సరైన అధికార భవనాలు, ఎస్పీ కార్యలయాలు ఏర్పడ్డాయా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మొదటి మున్సిపాలిటీగా ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ నియోజకవర్గం మున్సిపాలిటీగా ఏర్పడి 70ఏళ్లు గడుస్తున్నా.. ఎందుకు కనీస మౌలికసదుపాయాలు లేవని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాల్సిన ఎమ్మెల్యే ఇక్కడ ఉండకుండా.. రాయచూరులో ఉంటారని.. వారిని కలవాలి అంటే అక్కడికి వెళ్లాల్సిందేనని తెలిపారు. ఇలాంటి ఉద్దెర జీతగాడు ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : రేవంత్‌రెడ్డి

కేసీఆర్ పాలనలో విద్యను వ్యాపారంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు తీర్చకుండా.. నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా అప్పుడప్పుడు సద్ది కట్టుకుని వచ్చే ఎమ్మెల్యే కావాలో.. ఇక్కడే ఉండే సమస్యలు తీర్చే వ్యక్తి కావాలో ఆలోచించండని ఓటర్లను కోరారు. కొడంగల్, నారాయణపేట జంట నగరాల్లాంటివని.. కొడంగల్​తో సమానంగా నారాయణపేటను అభివృద్ధి చేస్తామని రేవంత్(Revanth Reddy) హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్తి పర్ణికకు వేసిన ప్రతి ఓటు రేవంత్ రెడ్డికే వేసినట్లేనని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే... రాజేందర్ రెడ్డిని రాయచూరు పంపుదామని.. కేసీఆర్​ను ఫామ్​హౌస్​కు పంపుదామని ప్రకటించారు.

అధికారంలోకి రాగానే చర్లపల్లి జైళ్లో కేసీఆర్​కు డబుల్ బెడ్​రూం ఇల్లు కట్టించడం ఖాయం

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

'బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్​దే'

ABOUT THE AUTHOR

...view details