నారాయణపేట జిల్ల కోస్గిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. కొడంగల్‌లో ప్రజలు ఓడించినా ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు మల్కాజిగిరికి వచ్చి కొడంగల్ ప్రజలు చేసిన తప్పును మీరు చేయొద్దంటూ ప్రచారం చేశారని రేవంత్ తెలిపారు. కొడంగల్ ప్రజలు నాటిన మొక్క దిల్లీ వరకు ఎదిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతానికి వచ్చి కొడంగల్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన హరీశ్ రావు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కోస్గిలో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ - revanth reddy
కొడంగల్ ప్రజలు నాటిన మొక్క దిల్లీ వరకు ఎదిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు.

రేవంత్ రెడ్డి
కోస్గిలో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ
ఇదీ చూడండి : 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం