తెలంగాణ

telangana

ETV Bharat / state

'టోకెన్లు ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎలా బంద్ చేస్తారు' - నారాయణపేటలో కంది రైతుల ఆందోళన

నారాయణపేట వ్యవసాయ మార్కెట్​లో మార్క్​ఫెడ్​ అధికారులు కందుల కొనుగోలు సెంటర్లు బంద్​ చేశారు. రైతులు తేమతో కూడిన కందులు తీసుకువస్తున్నారని క్రయవిక్రయాలు నిలిపివేశారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత పంట కొనుగోళ్లు ఎలా నిలిపివేస్తారని కంది రైతులు ఆందోళనకు దిగారు.

red gram farmers protest in narayanapeta
'టోకెన్లు ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎలా బంద్ చేస్తారు'

By

Published : Feb 13, 2020, 5:49 PM IST

'టోకెన్లు ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎలా బంద్ చేస్తారు'

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో మార్క్​ఫెడ్ అధికారులు కంది కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు ఆందోళనకు దిగారు. తమకు టోకెన్లు ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎలా బంద్​ చేస్తారని అధికారులను నిలదీశారు. రైతులు తీసుకువచ్చిన పంటనంతా కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12 శాతం తేమ ఉన్న కందులను మాత్రమే కొనుగోలు చేస్తామని, రైతులు పచ్చి కందులు తీసుకువస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకే కొనుగోలు సెంటర్లు బంద్​ చేశామని తెలిపారు.

సుమారు రెండు గంటలపాటు రైతులు రాస్తారోకో చేయడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్​ స్తంభించింది. పోలీసులు సర్దిచెప్పినా... రైతులు వెనక్కి తగ్గలేదు. టోకెన్లు ఇచ్చిన రైతుల పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా... కర్షకులు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details