నారాయణపేట జిల్లాలోని మండపేట వ్యవసాయ మార్కెట్లో అధికారులు కంది కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు ఆందోళనకు దిగారు. మార్క్ఫెడ్ అధికారులు టోకెన్లు ఇచ్చిన తర్వాత కొనుగోలు సెంటర్లు బంద్ చేశారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో రోజుకు చేరిన నారాయణపేట కంది రైతుల ఆందోళన - నారాయణపేట కంది రైతుల ఆందోళన
నారాయణపేట జిల్లాలో కంది రైతుల ఆందోళన రెండో రోజుకు చేరింది. మండపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లు నిలిపివేయడంపై కర్షకులు రాస్తారోకో చేశారు.

రెండో రోజుకు చేరిన నారాయణపేట కంది రైతుల ఆందోళన
రెండో రోజుకు చేరిన నారాయణపేట కంది రైతుల ఆందోళన
నారాయణపేట-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేయడం వల్ల రవాణా ఎక్కడికక్కడే స్తంభించింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా... రైతులు కదలకుండా భీష్మించుకు కూర్చున్నారు. తమ వద్ద నుంచి కందులు కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చిచెప్పారు.