నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురపాలక పార్కు ఎదుట పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఉపాధ్యాయుల విషయంలో.. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
'ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడాలి' - ఉపాధ్యాయ సంఘాల ధర్నా
నారాయణపేట జిల్లా కేంద్రంలో పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడాలి'
నిరసనలో ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు. చాలా రోజులుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చానా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తగదన్నారు.
ఇదీ చదవండి:ఉపాధ్యాయుల కొరతను అధిగమించేదెలా?