తెలంగాణ

telangana

ETV Bharat / state

"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి" - cmo osd

నారాయణపేట జిల్లా మక్తల్​ సమీపంలో నిర్మించనున్న రైల్వేస్టేషన్​ పరిసరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి  ఓఎస్డీ  ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి"

By

Published : Jul 11, 2019, 1:01 AM IST


నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో నిర్మించనున్న నూతన రైల్వే స్టేషన్ పరిసరాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. మక్తల్ నుంచి దేవరకద్ర మధ్య 30 కిలోమీటర్ల పొడవునా నిర్మాణమవుతున్న రైల్వే ట్రాక్​కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు ఉన్న పరిసరాలను హరిత వనాలుగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

"ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలి"

ABOUT THE AUTHOR

...view details