నారాయణపేట జిల్లా మక్తల్‌లో డయ్ల్ 100 వాహనం ప్రమాదానికి గురైంది. మక్తల్ నుంచి నారాయణపేట వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రోడ్డుపైకి పందులు వచ్చాయి. అడ్డు వచ్చిన పందులను తప్పించబోయి వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది.
పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన పందులు. డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం - పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన పందులు. డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం
రహదారిపైన ఒక్కసారిగా వచ్చిన పందులను తప్పించబోయి ప్రమాదంలో పడింది పోలీసుల డయల్ 100 వాహనం. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
POLICE PETROLING JEEP CAUGHT ACCIDENT
ప్రమాదం సమయంలో వాహనంలో డ్రైవర్ మక్బుల్ మాత్రమే ఉన్నాడు. ఘటనలో వెంటనే బెలూన్ తెరుచుకోవటం వల్ల డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్
TAGGED:
ACCIDENT NEWS IN TELANGANA