నారాయణపేట జిల్లా ఉట్కూరులో విక్రయించేందుకు తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. ఉట్కూరు మండలం ఎర్గాట్ గ్రామానికి చెందిన కొందరు నికిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్రం అయ్యారు. ప్రత్యేక గస్తీ బృందాన్ని ఏర్పాటుచేసి సోదాలు ప్రారంభించారు. అంతలో ఓ ఆటో డ్రైవర్ పోలీసుల కదలికలు గుర్తించి ఆటోను వేగంగా పోనిచ్చాడు. వెంటనే ఆటోను వెంబడించారు. అక్కడకు సమీప గ్రామంలో వాహనాన్ని నిలిపి.. వారందరు పరారయ్యారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సుమారు 150 కిలోల నకిలి పత్తి విత్తనాలను, విత్తనాలకు వేసే రంగులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన విత్తనాల విలువ సుమారు లక్ష ఇరవైవేల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
150 కిలోల నకిలి విత్తనాలు స్వాధీనం - narayanpet
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు దృష్టిసారించారు. సుమారు 150 కిలోల నకిలి పత్తి విత్తనాలు, విత్తనాలకు వేసే రంగులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షా ఇరవై వేల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
150 కిలోల నకిలి విత్తనాలు స్వాధీనం