'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి' - please gift plants
పర్యావరణం పట్ల అమిత ప్రేమ కలిగిన ఓ యువకుడు తన పెళ్లికి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన వివాహానికి వచ్చే వారు తనకి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
'నా పెళ్లికి మొక్కలు తీసుకురండి'
నారాయణపేట జిల్లాకు చెందిన మోహన్ తన వివాహానికి హాజరయ్యేవారు తనకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలంటూ సందేశాన్ని ఇస్తున్నాడు. పర్యావరణంపై మక్కువతో మొక్కలు పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. బహుమతిగా వచ్చేవాటిని జీవితాంతం సంరంక్షించే బాధ్యత మాదేనని హామీ ఇస్తున్నాడు. బహుమతులు బదులుగా మొక్కలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాన్ని పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.