నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం గుడిమున్కన్పల్లిలో కరోనా సోకిన వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఉలిగుండం నర్సప్ప(50)కి 5 రోజుల క్రితం కరోనా సోకింది. హోం క్వారంటైన్లో భాగంగా కుటుంబ సభ్యులు అతనిని వారి పాత ఇంట్లో ఉంచారు.
కరోనా సోకిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య - person suicide due to corona in gudimunkanpally village
కరోనా సోకిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి సభ్యులు తనను ప్రత్యేకంగా వేరే ఇంట్లో ఉంచడంతో ఆందోళనకు గురయ్యాడు. నారాయణ పేట జిల్లా గుడిమున్కన్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సప్ప.. శనివారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. కొవిడ్ నిబంధనల నడుమ ఉదయం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి