తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లికి పుట్టిలో వెళ్లాడు.. శవమై తేలాడు! - కృష్ణానదిలో పడి మృతి

ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చుసింది. శుభకార్యానికంటూ వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

person belongs to narayanpet district died in krishna river
పెళ్లికని వెళ్లి శవమై తేలాడు

By

Published : Dec 21, 2020, 8:16 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతి చెందాడు. బంధువుల గ్రామానికి పుట్టిలో వెళ్లిన గుంటప్ప తిరిగి రాకపోయేసరికి..ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక రాష్ట్రం నది ఒడ్డున బాధితుడి మృతదేహం లభ్యమైంది.

ఏం జరిగిందంటే...

ముస్లైపల్లి గ్రామనికి చెందిన పాలెం గుంటప్ప(45).. ఈనెల 18న బంధువుల వివాహం నిమిత్తం కర్ణాటకలోని ఓ గ్రామానికి, కృష్ణానది తీరం గుండా పుట్టి వేసుకొని బయలుదేరారు. రెండు రోజులు గడిచినా అతను ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మేరకు కర్ణాటక సరిహద్దుల్లో బాధితుడి మృతదేహం లభ్యమైంది. శుభకార్యానికంటూ వెళ్లిన గుంటప్ప శవమై తిరిగిరావటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:పెన్నానదిలో ఏడుగురు గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details