నారాయణపేట జిల్లాలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ సమీకృత బాలుర వసతి గృహంలో కలుషిత నీరు తాగి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత మూడురోజులుగా వసతి గృహానికి సరఫరా అయ్యే నీరు కలుషితమై అనారోగ్యం బారిన పడ్డారు.
కలుషిత నీరు తాగి 40మంది విద్యార్థులకు అస్వస్థత
నారాయణపేట జిల్లాలోని బాలుర వసతిగృహంలో కలుషిత నీరు తాగి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వెంటనే వైద్య పరీక్షలు చేయించి చిక్సిత అందించారు.
కలుషిత నీరు తాగి 40మంది విద్యార్థులు అస్వస్థత
వసతి గృహ వార్డెన్ కపిలేశ్వర్ రెడ్డి వైద్యులను పిలిపించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. కొంత మంది విద్యార్థులను వారి తల్లిదండ్రు వచ్చి ఇళ్లుకు తీసుకుని వెళ్లారు.
ఇదీ చూడండి:నేడు ఓరుగల్లులో ఉపరాష్ట్రపతి పర్యటన
Last Updated : Feb 23, 2020, 3:15 PM IST