రెక్కడితే కానీ డొక్కడని కుటుంబం వారిది వేసవి కాలం వ్యవసాయ పనులు లేక ఉపాధి పనికి వెళ్లి మృత్యువాత పడ్డారు ఆ నిరు పేదలు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో పోలింగ్‌కు ముందు రోజు ఈ ఘటన జరగడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆప్తులను పోగొట్టుకున్న సమయాన ఓటు వేయడానికి గ్రామస్థులు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసేవారు లేక పోలింగ్ కేంద్రం వెలవెలబోతోంది.
విషాదంలో తీలేరు గ్రామం... ఓటింగ్‌కు దూరం - polling
మట్టిపెళ్లలు కూలి 10 మంది మృతి చెందిన తీలేరులో ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విషాద సమయంలో ఓటు వేయడానికి గ్రామస్థులు ఆసక్తి చూపడం లేదు. గ్రామంలో మృతుల కుటుంబాలు దు:ఖంలో ఉండడం వల్ల ఓటు వేయలేకపోతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం