నారాయణపేట జిల్లా సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని యాద్గిర్, రాయచూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... జలాల్పూర్ చెక్‌పోస్టు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. చెక్‌పోస్టు దగ్గర ఏటువంటి వాహనాలను అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. మెడికల్, ఆసుపత్రికి సంబంధించిన అత్సవసర కేసుల వాహనాలు తప్ప మిగతా వాటిని అనుతించవద్దన్నారు.
నారాయణపేట జిల్లా సరిహద్దులో భద్రత కట్టుదిట్టం - corona case
నారాయణపేట జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని యాద్గిర్, రాయచూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.... ఎస్పీ చేతన భద్రతను పరిశీలించారు. ఎవ్వరినీ అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు.

నారాయణపేట జిల్లా సరిహద్దులో భద్రత కట్టుదిట్టం
చెక్‌పోస్టు దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని... భోజనం, తాగునీరు, మాస్కులు శానిటైజర్లు ఎప్పటికప్పుడు సమకూర్చాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ చేతన తెలిపారు.