తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టం' - నారాయణపేటలో మంత్రుల పర్యటన

నూతన రెవెన్యూ చట్టం రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో వారు పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్​ నడిపి ర్యాలీ ప్రారంభించారు.. మంత్రి నిరంజన్​రెడ్డి.

ministers on new revenue act
'రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టం'

By

Published : Sep 30, 2020, 8:27 PM IST

రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులంతా ట్రక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరయ్యారు. మంత్రి నిరంజన్ గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ర్యాలీని ప్రారంభించారు.

'రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టం'

భూ తగాదాల శాశ్వత పరిష్కారానికి తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే.. ప్రజల ఆస్తుల రక్షణ కలుగుతుందన్నారు. ఈ చట్టం రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

గతంలో పాస్​పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగేవారని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్​ రూపకల్పనతో అలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. దళారుల అవసరం లేకుండా రైతులే ఎక్కడైనా తమ భూ పత్రాలు తీసుకోవచ్చని మంత్రి తెలిపారు.

'రైతుల కోసమే నూతన రెవెన్యూ చట్టం'

ఇవీచూడండి:'కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకే.. నూతన రెవెన్యూ చట్టం'

ABOUT THE AUTHOR

...view details