నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని చిన్నపొర్లలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పంచాయతీ భవనం ఓవైపు పూర్తికావొస్తుండగా... మరోవైపు గోడలు బీటలు వారి పడిపోయే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపట్టి చేతులెత్తేస్తున్నారు. ఇదేకాక భవనాన్ని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు కూడా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేసి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పంచాయతీ భవనం
గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ భవనాలు అధికారుల పర్యవేక్షణాలోపానికి అద్దం పడుతున్నాయి. ప్రారంభానికి ముందే గోడలు బీటలువారి పడిపోయే పరిస్థితికొస్తున్నాయి.
NEW GRAMA PANCHAYAT BUILDING GET CRACKS