నారాయణపేట జిల్లా స్థానిక ప్రజావాణిలో నేతన్న చేయూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
'నూతన డిజైన్లపై నేతన్నలకు శిక్షణ ఇప్పిస్తాం' - నేతన్నల కష్టాలు
లాక్డౌన్ కారణంగా నష్టపోయిన నేతన్నలకు నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించి... సాయం చేసేందుకు కృషి చేస్తామని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. స్థానిక ప్రజావాణిలో నేతన్న చేయూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'నూతన డిజైన్లపై నేతన్నలకు శిక్షణ ఇప్పిస్తాం'
కొత్త డిజైన్లు చేసినట్లయితే మార్కెట్లో గిరాకీ లభిస్తుందని సూచించారు. నారాయణపేట చీరలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. టెస్కో ద్వారా కమిటీ వేసి లాక్డౌన్లో నేసిన చీరలను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నూతన డిజైన్లపై నేతన్నలకు శిక్షిణ ఇప్పిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:పరాధీనతను పారదోలగలమా.. అసలు సాధ్యమేనా?