నారాయణపేట జిల్లా కేంద్రంలో బీసి సంక్షేమ శాఖ ఆధ్వర్యములో కుమ్మరి సంఘం వారు మట్టితో తయారు చేసిన సీడ్ గణపతులను జిల్లా కలెక్టర్ హరిచందన పంపిణీ చేశారు. కొవిడ్- 19 నేపథ్యంలో మట్టి గణపతులను ప్రతిష్టించుకుని ఎవరి ఇళ్లలో వారే వినాయక చవితి పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ చంద్రారెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, కుమ్మరి సంఘం నాయకులు దత్తు, తిలేరు రాజు, యాదయ్య, కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
విత్తన గణపతులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే మట్టి గణపతులను ప్రతిష్టించుకుని పూజలు చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. జిల్లా కేంద్రంలో కుమ్మరి సంఘం వారు తయారుచేసిన విత్తన గణపతులను కలెక్టర్ పంపిణీ చేశారు.
మట్టి గణపతులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్