తెలంగాణ

telangana

విధుల్లో నిర్లక్ష్యం.. 10 మందికి షోకాజ్ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది సిబ్బందికి నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్​రావ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

By

Published : Sep 26, 2019, 9:46 PM IST

Published : Sep 26, 2019, 9:46 PM IST

షోకాజ్ నోటీసులు

నెల రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది అధికారులు, సిబ్బందికి నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్​రావ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం స్రజ్​ఖాన్ పేట గ్రామాన్ని పాలనాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ సహా 10 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 30 రోజుల ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కలెక్టర్ వెంకట్​రావ్ ఇప్పటికే జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రస్తుతం 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 6 నాటిని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని... చురుగ్గా పనిచేసే వాళ్లను ప్రోత్సహించడమే కాదు.. నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

10 మందికి షోకాజ్ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details