కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విద్యుత్‌శాఖ డీఈ చంద్రమౌలి తెలిపారు. నెల రోజుల క్రితం నారాయణపేట విద్యుత్‌శాఖలో ఏఈగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్... సివిల్స్‌లో 272 ర్యాంకు సాధించటాన్ని కొనియాడారు. విద్యుత్ శాఖ తరఫున రాహుల్‌ను సన్మానించారు.
'కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు' - narayanapet news
సివిల్స్‌లో 272వ ర్యాంకును సాధించిన రాహుల్‌ను విద్యుత్‌శాఖ డీఈ సన్మానించారు. నెల రోజుల క్రితం నారాయణపేట విద్యుత్ శాఖలో ఏఈగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ సివిల్స్‌లో ర్యాంకు సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
narayanpet power department de appreciated civils ranker
వలసల జిల్లాగా చెప్పుకునే నారాయణపేట పేరును రాహుల్ తన సివిల్స్ లక్ష్యంతో నలువైపులా మారుమోగించారన్నారు. చదువుపై శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా... లక్ష్యాన్ని చేరుకోవచ్చని రాహుల్ నిరూపించారన్నారు. నేటి తరం విద్యార్థులు రాహుల్‌ను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను ఛేదించాలని చంద్రమౌలి సూచించారు.