నారాయణపేట జిల్లా కేంద్రంలో గన్నీ బ్యాగులను తిరిగి ప్రభుత్వానికే ఇవ్వాలని కలెక్టర్ హరిచందన తెలిపారు. కలెక్టరేట్ సమావేశం హాలులో చౌక ధర దుకాణ డీలర్లతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల 100 శాతం గన్నీ బ్యాగులను రెగ్యులర్‌గా ఇవ్వాలని, డీలర్లు డాటా ఎంట్రీ, గ్రూప్ ఇన్సూరెన్స్ వివరాలను అందజేయడంలో తహసీల్దార్లతో సహకరించి త్వరగా పని పూర్తయ్యేటట్లు చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
'గన్నీ బ్యాగులన్నీ తిరిగి సర్కారుకు అందజేయాలి'
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో చౌకధర దుకాణ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. దుకాణ డీలర్లందరూ గన్నీ బ్యాగులను తిరిగి ప్రభుత్వానికే ఇవ్వాలని కలెక్టర్ హరిచందన తెలిపారు.
'గన్నీ బ్యాగులన్నీ తిరిగి సర్కారుకు అందజేయాలి'
ప్రతి దుకాణంలో నేమ్ బోర్డు, ధరల పట్టిక, నిల్వల సూచిక తప్పకుండా ఉండేటట్లు చూడాలని.. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ పనులన్నీ ఈనెల 30 లోపు పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్వో శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.