ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాళీలన్నింటినీ భర్తీ చేసేలా చర్యలు : హరిచందన - తెలంగాణ వార్తలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో నారాయణపేట కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. మార్చి 31లోగా అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

narayanpet collector harichandana participated in video conference by state chief secretary
ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
author img

By

Published : Jan 6, 2021, 12:09 PM IST

మార్చి 31లోగా అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తూ... కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న వారి దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తామని నారాయణపేట కలెక్టర్ హరిచందన తెలిపారు. వివిధ శాఖల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి పోర్టల్ బీలో పెండింగ్ కేసులన్నింటిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆమె పాల్గొన్నారు.

ఉపాధి హామీలో పనిదినాలు పెంచి... జాబ్ కార్డ్ కలిగి పని కోరిన ప్రతి ఒక్కరికీ వంద రోజుల పని కల్పిస్తామని అన్నారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల వివరాలను, వాటి ప్రభావంతో వివిధ శాఖల్లో ఏర్పడిన మొత్తం ఖాళీలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలుసు: ప్రతాప్​రావు‌

ABOUT THE AUTHOR

author-img

...view details