తెలంగాణ

telangana

ధరణి పోర్టల్​ నిర్వహణపై కలెక్టర్​ అవగాహన కార్యక్రమం

By

Published : Sep 24, 2020, 9:33 PM IST

ధరణి పోర్టల్ నిర్వహణపై నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లకు కలెక్టర్​ హరిచందన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్​ల మీద ఆధారపడకుండా తహసీల్దార్​లే స్వయంగా ధరణి పోర్టల్​ను వాడాలని సూచించారు.

awareness on dharani portal at narayanpe
ధరణి పోర్టల్​ నిర్వహణపై కలెక్టర్​ అవగాహన కార్యక్రమం

నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్​ హరిచందన ధరణి పోర్టల్ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్​, మ్యుటేషన్ల సేవలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇందుకోసం తహసీల్దార్లు .. తమ కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు ఉన్నాయో లేదో సరిచూసుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్​ హరిచందన తెలిపారు.

ధరణి పోర్టల్​ను డాటా ఎంట్రీ ఆపరేటర్​ల మీద ఆధారపడకుండా తహసీల్దార్​లే స్వయంగా చేయాలని కలెక్టర్​ సూచించారు. పోర్టల్​లో ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ఎలా సవరించుకోవాలో ముందే చూసుకోవాలన్నారు. అలాగే గ్రామ వీఆర్వోలను భూ సంబంధిత వ్యవహారాలతో పాటు ఇతర పథకాలు, సమాచార సేకరణకు వారిసేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

అనంతరం జిల్లా స్థాయి గ్రీన్ కమిటీతో కలెక్టర్​ హరిచందన సమావేశమయ్యారు. ఈ ఏడాదికి ఇచ్చిన టార్గెట్​లో భాగంగా మొక్కలు నాటి వాటికి జియో ట్యాగింగ్​ ఎంతవరకు చేశారని ఆయా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న మియావాకి పెట్టి బయో ఫెన్సింగ్​ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్​ సూచించారు.

ఇదీ చదవండిఃపెండింగ్​ మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి: ప్రభుత్వం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details