నారాయణపేట జిల్లాగా ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా మక్తల్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు నేటికి మహబూబ్నగర్ జిల్లా పేరు మీదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ, పశు వైద్యశాల, మండల మహిళా సమాఖ్య భవనం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఎంపీడీవో విశ్రాంతి భవనం కార్యాలయాలు.. మరికొన్ని పాఠశాలల బోర్డులకు జిల్లా పేరు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు మా జిల్లా పేరే పెట్టండి
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు తమ జిల్లా పేరు పెట్టాలని నారాయణ పేట జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లా ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా మక్తల్ మండలంలో పలు భవనాలకు మహబూబ్నగర్ జిల్లా పేరు ఉండటంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు మా జిల్లా పేరే పెట్టండి