నారాయణపేట జిల్లా నర్వలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశాలపై పెండింగ్ ఈ చలానా క్లియరెన్స్ కోసం ఎంపీడీవో చౌరస్తాలో డ్రైవ్ నిర్వహించారు.
పెండింగ్ ఈ చలాన్ క్లియరెన్స్ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్ - తెలంగాణ తాజా వార్తలు
ఈ చలాన్ పెండింగ్ వాహనాలపై నర్వ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్ మొత్తాలను చెల్లించాల్సి ఉన్న 19 వాహనాలను గుర్తించి రూ. 13,300 వాహన యజమానులతో మీ-సేవా ద్వారా కట్టించారు.
పెండింగ్ ఈ చలాన్ క్లియరెన్స్ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్
మూడుసార్లు పైబడి చలానా పెండింగ్లో ఉన్న 19 వాహనాలను గుర్తించి రూ.13,300 వాహన యజమానులతో మీ-సేవా ద్వారా కట్టించారు. ఇకపై ఈ డ్రైవ్ తరచుగా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. చలానా మొత్తం చెల్లించిన తర్వాతనే వాహనాలు ఇస్తామని పేర్కొన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.