నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న మాతా మాణికేశ్వరి ఆశ్రమం మూగబోయింది. మాతా మాణికేశ్వరి ఇక లేరన్న విషయం తెలిసి భక్తి లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం అమ్మ మరణించారన్న వార్త తెలియగానే ఆలయ వర్గాలు, కార్యవర్గ సభ్యులు, మత భక్తులు నిశ్చేష్టులయ్యారు. మాత పార్థివదేహ దర్శనానికి వచ్చిన భక్తలతో ఆశ్రమ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
మాతా మాణికేశ్వరి ఇక లేరు.. భక్తుల సందర్శనార్ధం పార్ధివదేహం - mata manikeswari is no more
దేశ వ్యాప్తంగా భక్తుల సేవలందుకుంటున్న మాతా మాణికేశ్వరి మరణ వార్త విని భక్తలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. భక్తుల సందర్శనార్ధం మాత పార్థివ దేహాన్ని నారాయణపేటలోని మాణికేశ్వరి ఆశ్రమంలో ఉంచారు.
జిల్లా సరిహద్దుల్లోని యానగుంది మాణిక్యమ్మకు దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. చిన్నతనంలోనే నారాయణ పేట వచ్చిన మాతకు రామ్ రెడ్డిరామ్ దేవుని గుడిలో ఆశ్రయం ఇచ్చారని అని చెబుతారు. అనంతరం ఆమె యానగుంది గుట్టపైకి చేరుకున్నారు. అప్పుడు అక్కడ ఎలాంటి ఆలయాలు లేవు. ఆమె అక్కడే ఉంటూ తపస్సులో నిమగ్నమై ఉండేవారు. ఆ తర్వాత మాణికేశ్వరీ మాత ఆదేశాలతో భక్తులు శివాలయం, వెంకటేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, పార్వతి, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను అభివృద్ధి చెందించారు.
ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు