నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రీన్ కమిటీ సమావేశంలో పాలనాధికారి హరి చందన పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 65 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. అలాగే మున్సిపాలిటీలో పెద్దమొత్తంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలని వెల్లడించారు.
యాక్షన్‌ప్లాన్... 65 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక - 6th Edition of Harithaharam Programme in Narayanapeta
నారాయణపేట జిల్లాలో 65 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు.
మున్సిపాలిటీలో పచ్చదనం పెంచాలి
గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం తెలంగాణకు హరితహారం పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి నారాయణ రావు, డీఆర్డీఓ కాళిందిని, డీఈఓ రవీందర్ పాల్గొన్నారు.