నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరి చందన అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో సమావేశం నిర్వహించారు. రాబోయే వాన కాలంలో 4,40,000 ఎకరాల్లో పంట సాగు అంచనా ఉందన్నారు. 84,000 ఎకరాల్లో వరి, 2,00,000 ఎకరాల్లో పత్తి, 1,40,000 ఎకరాల్లో కంది సాగయ్యే అవకాశం ఉందన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ - తెలంగాణ వార్తలు
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరి చందన అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన
పత్తి విత్తనాలకు సంబంధించి హెచ్టీ కాటన్ విత్తనాలు, నకిలీ విత్తనాలు.. ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలను నిరోధించడానికి జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:'ప్రజలు సహకరించాలి... లేకుంటే కఠిన చర్యలు తప్పవు'