తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేట జిల్లాలో 600 కిలోల నల్లబెల్లం స్వాధీనం - narayanapet excise police

నారాయణపేట జిల్లాలో ఆకస్మికంగా జరిపిన తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న 600 కిలోల నల్లబెల్లాన్ని జిల్లా ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

narayanapet excise police caught Black jaggery
నారాయణపేట జిల్లాలో 600 కిలోల నల్లబెల్లం స్వాధీనం

By

Published : Apr 14, 2020, 6:16 PM IST

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వత్తుగండ్ల గ్రామం నుంచి పేరపళ్లకు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తోన్న సుమారు 600 కిలోల నల్లబెల్లాన్ని జిల్లా ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు.

ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసున్నామని ఇంఛార్జి ఎక్సైజ్​ శాఖ అధికారి రమణయ్య తెలిపారు. వీరందరిని చట్టప్రకారం మెజిస్ట్రేట్​ ముందు బైండోవర్​ చేస్తామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details