నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలంలోని తిప్రాస్పల్లి దగ్గరలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. జిల్లాలోని రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిచందన - కలెక్టర్ హరిచందన తాజా వార్తలు ఊట్కూరు మండలం
నారాయణ పేట జిల్లా రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ఊట్కూరు మండలంలోని తిప్రాస్ పల్లి సమీపంలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ హరిచందన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం వద్ద వాహనాలు ఎక్కువగా బారులు తీరకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిచందన
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని అధికారులను హరిచందన ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద ఎక్కువగా వాహనాలు బారులు తీరకుండా టోకెన్లు జారీచేసి పత్తి పంట కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఏవో జాన్ సుధాకర్, సీసీఐ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.