తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్ నిరసన

విపరీతంగా పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని నారాయణపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్​ ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది.

By

Published : Jul 6, 2020, 5:00 PM IST

వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్ నిరసన
వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్ నిరసన

కరోనా కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు విధించిన అధిక విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనకు దిగింది. నారాయణపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు నల్ల జెండాలు, బ్యాడ్జ్​లతో ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ క్లిష్ట కాలంలో సామాన్య ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం వల్ల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. నాన్ టెలిస్కోపిక్ విధానంలో కరెంట్ బిల్లులను తీసి ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందన్నారు.

అధిక వసూలేమిటి ?

ఒక్కో విద్యుత్ మీటర్​కు సగటున 90 రోజుల బిల్లులు వేశారని.. ఫలితంగా యూనిట్​కు రూ.4.30 పైసలకు బదులు రూ.9 వసూలు చేస్తున్నారన్నారు. అధిక కరెంట్ బిల్లులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయాలని కోరుతూ ఉప ఈఈ చంద్రమౌళికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి వేణుగోపాల్, కౌన్సిలర్ సలీం, పార్టీ పట్టణ అధ్యక్షుడు శశికాంత్, చామకూర తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details