రాష్ట్రంలో అమలవుతోన్న అభివృద్ధి పథకాలను దృష్టిలో ఉంచుకొని సురభి వాణీ దేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నేం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన కేసీఆర్కు.. ఆమె విజయాన్ని కానుకగా ఇవ్వాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. ఓటర్లు.. సురభి వాణి దేవికే మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు.
'ఓటర్లు.. సురభి వాణి దేవికి మద్దతుగా నిలుస్తున్నారు' - మహబూబ్నగర్ ఎంపీ మన్నేం శ్రీనివాస్ రెడ్డి
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మహబూబ్నగర్ ఎంపీ మన్నేం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి సురభి వాణీ దేవిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని సూచించారు.
'ఓటర్లు.. సురభి వాణి దేవికి మద్దతుగా నిలుస్తున్నారు'
కరోనా కారణంగా పెండింగ్లో పడిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను రెండు సంవత్సరాల్లో పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. రానున్న రోజుల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. భాజపా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు.. పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్