అన్ని వర్గాల్లో తెరాస పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సభలో.. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఇవి కేవలం రెండు పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన ఎన్నికలే అయినా.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేవిగా భావించాల్సి ఉంటుందని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
'ఎమ్మెల్సీ ఎన్నికలు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేవి'
పట్టభద్రుల ఎన్నికలు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్పేవిగా భావించాల్సి వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంలో భాజపా అభ్యర్థి రాంచందర్రావు మరోసారి విజయం సాధిస్తారని ధీమావ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేవి: కిషన్రెడ్డి
తెరాస హవా కొనసాగిన 2015 ఎన్నికల్లోనే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంలో భాజపా అభ్యర్థి రాంచందర్రావు విజయం సాధించారని కిషన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెరాసపై అన్నిచోట్ల వ్యతిరేకత ఉందని.. ఈసారీ భాజపానే విజయం సాధిస్తుందని ధీమావ్యక్తం చేశారు.
ఇవీచూడండి:'రాంచందర్రావు.. ప్రశ్నించే గొంతుకయితే.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి'