మహిళల ఆత్మ గౌరవానికి టాయిలెట్ ఎంతో ఉపయోగపడతాయని నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ ఛైర్ పర్సన్ శిరీష అన్నారు. ఇటీవల మహిళల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ షీ టాయిలెట్స్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారని తెలిపారు. జిల్లా పాలనాధికారి హరిచందన చొరవతో 12 లక్షల వ్యయంతో ఒక బస్సులో రూములు ఏర్పాటు చేసి అందులో మహిళల కోసం మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు.
మహిళల ఆత్మగౌరవానికి మొబైల్ టాయిలెట్స్ - latest news of mobile toilets
మరుగుదొడ్లు మహిళ ఆత్మగౌరవానికి ఎంతో తోడ్పడతాయని కోస్గి మున్సిపల్ ఛైర్ పర్సన్ శిరీష వెల్లడించారు. మొట్టమొదటి సారిగా మొబైల్ షీ టాయిలెట్స్‌ను నారాయణపేట జిల్లాలో కలెక్టర్ హరిచందన చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
మహిళల ఆత్మగౌరవానికి మొబైల్ షీ టాయిలెట్స్
మహిళలు పనుల నిమిత్తం బయటికి వచ్చినప్పుడు అందుబాటులో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయని అందుకోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగాగా నారాయణపేట వీటిని ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే మహిళలకు ఎంతో ఉపయోగకరమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు