తెలంగాణ

telangana

ETV Bharat / state

దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే రామ్మోహన్ - mla ram mohan

రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కొనుగోలు కేంద్రాలను అన్నదాతలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

MLA Rammohan Reddy
మక్తల్ ధాన్యం కొనుగోలు కేంద్రం

By

Published : Apr 21, 2021, 4:18 PM IST

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. అన్నదాతలకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని మార్కెటింగ్ యర్డ్​లో ఏర్పాటైన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

పంటను సకాలంలో తీసుకువచ్చి.. మంచి మద్దతు ధర తీసుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ నిజం పాషా, పీఏసీఎస్ ఛైర్మన్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details