కొడంగల్, కోస్గి పట్టణాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి - Telangana news
నారాయణపేట జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
కొడంగల్, కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కరోనా నిబంధనలు గాలికొదిలేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు