కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం - Kalyana lakshmi cheques news
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అందజేశారు. అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని… సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. మాగనూరు మండలానికి చెందిన పది మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగనూర్ జడ్పీటీసీ వెంకటయ్య, మాగనూర్ మండల తహశీల్దార్ తిరుపతయ్య, ఆర్ఐ నర్సింహులు, సర్పంచ్ రాజు, ఎంపీటీసీ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.