తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి - నారాయణపేట జిల్లాలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

నారాయణపేట జిల్లాలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

karthika
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

By

Published : Nov 27, 2019, 9:37 AM IST

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రధాన అలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు.

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details