రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
'రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం' - 6th phase harithahaaram
నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు.
mla chittem rammohan reddy participated in haritha haaram
అనంతరం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితా రెడ్డి, మహిపాల్ రెడ్డి , రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.