నారాయణపేట జిల్లా సంగంబండ డ్యామ్‌కు నీళ్లు రావటంపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. జూన్ నెల ప్రారంభంలోనే భీమా లిప్టులు ప్రారంభించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. గురువారం ఖానాపూర్ రోడ్‌లోని భీమా ఫేజ్ వన్ లిఫ్ట్ టూ నుంచి నీటిని డ్యామ్‌కు విడుదల చేశారు.
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
జూన్‌లోనే సంగంబండ డ్యామ్‌కు నీళ్లు రావడంపై నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భీమా ఫేజ్ వన్ లిఫ్ట్ టూ నుంచి సాగునీటిని విడుదల చేశారు.
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఈసారి కూడా పుష్కలంగా వర్షాలు కురిసి, రైతన్నలకు పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అక్కడే మియావాకి విధానంలో పెంచుతున్న ఆయుర్వేద నర్సరీని పరిశీలించారు. యాదాద్రి తరహాలో చిట్టడవిని ఎకరం పరిధిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాగనూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి విభాగాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుకు కేసీఆర్ కిట్ అందించారు.
ఇదీ చదవండి:విద్యార్థులకు గుడ్‌న్యూస్: స్టూడెంట్ వీసాల ప్రక్రియ ప్రారంభం