నారాయణపేట జిల్లా కేంద్రం సహా పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి స్వల్ఫంగా కంపించడం జనాన్ని భయాందోళనకు గురిచేసింది. నారాయణపేట మండలం సింగారం, జాజాపూర్, ఊట్కూరు మండల కేంద్రంతో పాటు నిడుగుర్తి, పెద్డపొర్ల, నాగిరెడ్డి పల్లి గ్రామాల్లో శబ్దంతో స్వల్పంగా భూమి కపించడంతో జనం ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
'ఇది సాధారణ భూకంపమే.. ఎవరూ భయపడొద్దు' - Earthquake in Narayanpet district
నారాయణపేట జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీనిపై ఎవరూ భయపడొద్దని జిల్లా కలెక్టర్ హరిచందన స్పష్టం చేశారు. ఇవి సాధారణ భూ ప్రకంపనలని.. తెలిపారు.

భూకంపనంపై ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని... సాధారణ కంపనాలని జిల్లా కలెక్టర్ డి.హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. భూ కంపనాలపై హైదరాబాద్‌లోని యన్జీఆర్ఐ శాస్త్రవేత్త డా.నాగేశ్వర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. రిక్టర్ స్కేలుపై 2.4 గా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. పరిసర ప్రాంతాల్లో బ్లాస్టింగ్ వల్ల వచ్చిన భూ ప్రకంపనలు కావని, ఇలాంటివి అక్కడక్కడ సాధారణంగా వస్తుంటాయని వాటి వల్ల ఎలాంటి నష్టం ఉండదని శాస్త్రవేత్తలు వివరించినట్లు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన పార్లమెంటు భవన నిర్మాణం