నారాయణ పేట జిల్లా మక్తల్లో మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రైతుబంధు పేరిట ఎకరాకు 10 వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. వృద్ధులకు రూ.2వేలు అందిస్తూ ఆసరా కల్పిస్తున్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతంలో కొత్తగా 50 ఎకరాల్లో నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రతీ ఎకరాకు నీరు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - excise minister srinivasgoud
మక్తల్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్లో మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.
శ్రీనివాస్ గౌడ్
TAGGED:
excise minister srinivasgoud