మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో జూరాల బ్యాక్ వాటర్‌లో 12 లక్షల 69 వేల చేప పిల్లలను వదిలారు.
ముదిరాజుల కోసం సబ్సిడీతో వలలు, స్కూటర్లు, బొలెరోలు, శీతల కేంద్రాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ముదిరాజులు తప్ప ఇతర కులస్థులు చేపలు పట్టడానికి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 2 కోట్లు ఇస్తే.. తాము ఒక్క ఏడాదిలోనే 180 కోట్లు సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు.