తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ కేర్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​

నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణ కేంద్రంలో కొవిడ్ కేర్​ సెంటర్​ను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. రోగులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు

Minister Srinivas Gowda inaugurated the covid Care Center
Minister Srinivas Gowda inaugurated the covid Care Center

By

Published : May 19, 2021, 6:41 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో కొవిడ్​ కేర్​ సెంటర్​ను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ప్రారంభించారు. నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 బెడ్లతో పాటు.. 10 బెడ్లతో కూడిన కొవిడ్ కేర్ సెంటర్​ను ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలతో కొవిడ్ కేర్ సెంటర్​లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. రోగులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా... ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఇవీ చూడండి:కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details