నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల వార్డును కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు.
రూ.20 లక్షలతో నిర్మించే అమరవీరుల స్మారక ఉద్యానవనం, సింగారం క్రాస్‌రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, అంబేడ్కర్ చౌరస్తా సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పిల్లల, సైన్స్ పార్కును ప్రారంభిస్తారు. సైన్స్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు.