వలస జీవి నడక యాతన! - migrant workers are Travelling from Yadgir to Uttar Pradesh
లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రంలో వలస కూలీలు, కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవాలన్న గట్టి తలంపుతో పరిపరి విధాలుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మార్గమధ్యంలో ఎవరైనా అంతో ఇంతో పెడ్తే తింటూ మళ్లీ ప్రయాణం సాగిస్తున్నారు.
వలస కూలీలకు లాక్‌డౌన్ కష్టాలు తప్పడం లేదు. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మరుగుదొడ్లను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లిన కూలీలు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఉపాధి లేకపోవడంతో సొంతూరికి వెళ్లేందుకు ఆదివారం ఉదయం బయలుదేరారు. నారాయణపేట మీదుగా ధన్వాడ వచ్చేసరికి రాత్రయింది. కాసేపు సేదదీరి మళ్లీ నడక ప్రారంభించారు. కాలినడకన హైదరాబాదు దాకా వెళతామని, అవకాశముంటే అక్కణ్నుంచి శ్రామిక్ రైళ్లలో పయనమవుతామన్నారు. లేదంటే కాలినడకనే యూపీకి వెళతామని తెలిపారు.